Share News

LTIMindtree Q3 Results: ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభంలో క్షీణత

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:45 AM

ఐటీ రంగంలోని ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభం డిసెంబరు త్రైమాసికంలో 10.5ు తగ్గి రూ.970.6 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల..

LTIMindtree Q3 Results: ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభంలో క్షీణత

న్యూఢిల్లీ: ఐటీ రంగంలోని ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభం డిసెంబరు త్రైమాసికంలో 10.5ు తగ్గి రూ.970.6 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలు బాధ్యత కోసం రూ.590 కోట్లు కేటాయించడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.1,085 కోట్లుంది. ఇదిలా ఉండగా కంపెనీ ఆదాయం 11.6ు పెరిగి రూ.10,781 కోట్లకు చేరింది. సెప్టెంబరు త్రైమాసికంతో పోల్చితే మాత్రం లాభం 30.7ు క్షీణించగా ఆదాయం మాత్రం 3.7ు పెరిగింది. క్యూ3లో కొత్తగా 1,511 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోగా డిసెంబరు 31 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 87,958గా ఉంది.

ఇవి కూడా చదవండి:

రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?

అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..

Updated Date - Jan 20 , 2026 | 05:45 AM