Share News

Wipro Fresher Hiring Issue: ‘ఫ్రెషర్స్‌’కు చుక్కలు చూపిస్తున్న విప్రో

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:48 AM

ఐటీ కంపెనీ విప్రో 250 మందికిపైగా ఫ్రెషర్లకు చుక్కలు చూపిస్తోంది. క్యాంప స్‌ నియామకాల్లో ఎంపికయ్యారని తీపి కబురు చెప్పి...

Wipro Fresher Hiring Issue: ‘ఫ్రెషర్స్‌’కు చుక్కలు చూపిస్తున్న విప్రో

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ విప్రో 250 మందికిపైగా ఫ్రెషర్లకు చుక్కలు చూపిస్తోంది. క్యాంప స్‌ నియామకాల్లో ఎంపికయ్యారని తీపి కబురు చెప్పి, ఏడెనిమిది నెలలైనా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా తాత్సారం చెస్తోంది. మా పరిస్థితి ఏమిటని అభ్యర్థులు నిలదీస్తున్నా కంపెనీ నుంచి ఉలుకూ పలుకు లేదు. దీంతో వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని ఫ్రెషర్లకు న్యాయం చేయాలని ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ఎన్‌ఐటీఈఎ్‌స.. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ఫిర్యాదు చేసింది. విప్రో వైఖరితో ఈ అభ్యర్థులు క్మాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో వేరే కంపెనీల ఇంటర్వ్యూలకు దూరమై రెండు విధాలా నష్టపోయారని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయకపోతే, ఐటీ పరిశ్రమలో ఇది మామూలు విషయంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి..

ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..

మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 20 , 2026 | 05:48 AM