AssetPlus Funding News: అసెట్‌ప్ల్‌సకు రూ.175 కోట్ల నిధులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:54 AM
డిజిటల్ వెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అసెట్‌ప్లస్ రూ.175 కోట్ల నిధులు సమీకరించింది. నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ నుంచి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డిజిటల్ వెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అసెట్‌ప్లస్ రూ.175 కోట్ల నిధులు సమీకరించింది. నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ నుంచి ఈ మొత్తాలను సమీకరించినట్లు వెల్లడించింది. డిస్ట్రిబ్యూటర్ ఆధారిత వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలోకి ప్రవేశించేందుకు ఈ మొత్తాలను వినియోగించనున్నట్లు సంస్థ కో ఫౌండర్, సీఈఓ విశ్రాంత్ సురేశ్ వెల్లడించారు. అలాగే ఉత్పత్తుల పోర్టుపోలియో విస్తరణ, పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులతో పాటు వచ్చే ఆరు నెలల్లో వినియోగదారులకు గిఫ్ట్ సిటీ ద్వారా అంతర్జాతీయంగా ఇన్వె్‌స్టమెంట్స్ ఆప్షన్స్‌ను అందిచాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఎయిట్‌రోడ్స్ వెంచర్స్, జీరోధా కో ఫౌండర్ నితిన్ కామత్‌కు చెందిన రెయిన్‌మ్యాటర్ ఫండ్.. అసెట్‌ప్ల్‌సలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం అసెట్‌ప్లస్ నిర్వహణలో రూ.7,250 కోట్ల ఆస్తులున్నాయి.
ఇవి కూడా చదవండి..
ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..
మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..