Share News

PNB Q3 Results: పీఎన్‌బీ లాభం రూ.5,100 కోట్లు

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:57 AM

ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) డిసెంబరు త్రైమాసికంలో 13ు వృద్ధితో రూ.5,100 కోట్ల లాభం ఆర్జించింది. ఒక త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన అత్యధిక లాభం...

PNB Q3 Results: పీఎన్‌బీ లాభం రూ.5,100 కోట్లు

ముంబై: ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) డిసెంబరు త్రైమాసికంలో 13ు వృద్ధితో రూ.5,100 కోట్ల లాభం ఆర్జించింది. ఒక త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన అత్యధిక లాభం ఇదే. మొండి బకాయిల తగ్గుదల ఈ వృద్ధికి దోహదపడిందని బ్యాంక్‌ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ ఆర్జించిన లాభం రూ.4,508 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక ఫలితాల స్ఫూర్తితో ఇక ప్రతి త్రైమాసికంలోనూ రూ.5,000 కోట్ల పైబడి లాభం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశోక్‌ చంద్ర చెప్పారు. కాగా ఇదే కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.34,752 కోట్ల నుంచి రూ.37,253 కోట్లకు పెరిగినట్టు రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో బ్యాంక్‌ తెలిపింది. డిసెంబరు 31 నాటికి స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 4.09ు నుంచి 3.19 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.41ు నుంచి 0.32 శాతానికి దిగి వచ్చాయి. ఎన్‌పీఏలు తగ్గడంతో కేటాయింపులు సైతం రూ.1,341 కోట్ల నుంచి రూ.318 కోట్లకు తగ్గినట్టు బ్యాంక్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..

మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 20 , 2026 | 05:57 AM