Gold, Silver Rates on Jan 3: జోరుమీదున్న బంగారం, వెండి.. ధరల్లో మళ్లీ పెరుగుదల!
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:41 AM
బంగారం, వెండి ధరల్లో మళ్లీ ర్యాలీ మొదలైంది. కొత్త ఏడాది వరుసగా రెండో రోజూ ధరలు పెరిగాయి. మరి ప్రస్తుతం దేశంలో ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది చివర్లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ ఏడాది వరుసగా రెండో రోజూ ధరల్లో పెరుగుదల నమోదైంది. యూఎస్ ఫెడ్ రేటు కోతపై పెరుగుతున్న అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పసిడి, వెండికి డిమాండ్ పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం (జనవరి 3) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర నిన్నటితో పోలిస్తే సుమారు రూ.1150 మేర పెరిగి రూ. 1,36,210కు చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల వెండి ధర రూ.1060 మేర పెరిగి రూ.1,24,860కు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే సుమారు రూ.4100 మేర పెరిగి రూ.2,42,100 వద్ద స్థిరపడింది (Gold, Silver Rates on Jan 3).
ఎమ్‌సీఎక్స్‌లో శుక్రవారం పసిడి, వెండి ధరలు కూడా ఎగబాకాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ (10 గ్రాములు) ధరలు సుమారు 0.27 శాతం మేర పెరిగి రూ.1,36,173కు చేరింది. మార్చ్ వెండి ఫ్యూచర్స్ ధర కూడా కిలోకు సుమారు రూ.9 వేల మేర పెరిగి రూ.2,35,873 వద్ద స్థిరపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ స్పాట్ ధర ప్రస్తుతం 4,332 డాలర్ల వద్ద, వెండి ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,37,250; ₹1,25,810; ₹1,04,910
ముంబై: ₹1,36,210; ₹1,24,860; ₹1,02,160
న్యూఢిల్లీ: ₹1,36,360; ₹1,25,010; ₹1,02,310
కోల్‌కతా: ₹1,36,210; ₹1,24,860; ₹1,02,160
బెంగళూరు: ₹1,36,210; ₹1,24,860; ₹1,02,160
హైదరాబాద్: ₹1,36,210; ₹1,24,860; ₹1,02,160
విజయవాడ: ₹1,36,210; ₹1,24,860; ₹1,02,160
కేరళ: ₹1,36,210; ₹1,24,860; ₹1,02,160
పుణె: ₹1,36,210; ₹1,24,860; ₹1,02,160
వడోదరా: ₹1,36,260; ₹1,24,910; ₹1,02,210
అహ్మదాబాద్: ₹1,36,260; ₹1,24,910; ₹1,02,210
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹2,60,100
ముంబై: ₹2,42,100
న్యూఢిల్లీ: ₹2,42,100
కోల్‌కతా: ₹2,42,100
బెంగళూరు: ₹2,42,100
హైదరాబాద్: ₹2,60,100
కేరళ: ₹2,60,100
విజయవాడ: ₹2,60,100
పుణె: ₹2,42,100
వడోదరా: ₹2,42,100
అహ్మదాబాద్: ₹2,42,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి: