Share News

Nifty Hits New All Time: నిఫ్టీ సరికొత్త రికార్డు

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:29 AM

స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు శుక్రవారం జోరుగా కొనుగోళ్లు జరిపారు. దాంతో నిఫ్టీ ఒకదశలో 193.45 పాయింట్లు ఎగబాకి 26,340 వద్ద సరికొత్త ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది.

Nifty Hits New All Time: నిఫ్టీ సరికొత్త రికార్డు

  • ఇంట్రాడేలో 26,340 వద్దకు చేరిక

  • రూ.4.32 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు శుక్రవారం జోరుగా కొనుగోళ్లు జరిపారు. దాంతో నిఫ్టీ ఒకదశలో 193.45 పాయింట్లు ఎగబాకి 26,340 వద్ద సరికొత్త ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. చివరికి 182 పాయింట్ల లాభంతో 26,328.55 వద్ద స్థిరపడింది. సూచీ లాభపడటం వరుసగా ఇది మూడో రోజు. సెన్సెక్స్‌. 573.41 పాయింట్ల వృద్ధితో 85,762.01 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.4.32 లక్షల కోట్లు పెరిగి రూ.481.24 లక్షల కోట్లకు చేరుకుంది. పవ ర్‌, బ్యాంకింగ్‌, మెటల్‌, వాహన రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతోపాటు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆసియా మార్కె ట్ల సానుకూల సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. డిసెంబరు త్రైమాసికానికి కంపెనీల ఆదాయ వృద్ధి మరింత మెరుగుపడవచ్చన్న అంచనాలు సైతం కొనుగోళ్లను ప్రేరేపించాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

మరింత తగ్గిన పొగాకు షేర్లు: ఐటీసీ మరో 4ు డౌన్‌

కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన పన్ను కారణంగా సిగరెట్లు సహా పొగాకు కంపెనీల షేర్లు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి. ఐటీసీ షేరు బీఎ్‌సఈలో శుక్రవారం ఒకదశలో 5.11ు క్షీణించి మూడేళ్ల కనిష్ఠ స్థాయి రూ.345.35కి పతనమైంది. చివరికి 3.79ు నష్టంతో రూ.350.15 వద్ద ముగిసింది. దాంతో సెన్సెక్స్‌, నిఫ్టీల్లో టాప్‌ లూజర్‌గా మిగిలింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ స్టాక్‌ కూడా ఇంట్రాడేలో 4.58ు వరకు క్షీణించినప్పటికీ, చివరికి 1.7ు నష్టంతో రూ.2,250.65 వద్ద ముగిసింది. వీఎ్‌సటీ ఇండస్ట్రీస్‌ షేరు 1.49ు తగ్గి రూ.251.35 వద్ద క్లోజైంది.

ఎల్‌ఐసీకి రూ.11,500 కోట్లు నష్టం

  • గత రెండు సెషన్లలో ఐటీసీ షేరు సుమారు 14ు నష్టపోవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.72,000 కోట్ల మేర తరిగిపోయి రూ.4.38 లక్షల కోట్లకు పడిపోయింది. అంతేకాదు, ఐటీసీలో 15.86ు వాటా ఉన్న ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ కూడా రూ.11,500 కోట్ల మేర కరిగిపోయింది.

  • మళ్లీ రూ.90 దాటిన డాలర్‌: గడిచిన కొన్ని రోజుల్లో కాస్త తగ్గు తూ వచ్చిన అమెరికన్‌ డాలర్‌ విలువ మళ్లీ రూ.90 స్థాయిని దాటేసింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు శుక్రవారం 22 పైసల నష్టంతో రూ.90.20 వద్ద ముగిసింది.

Updated Date - Jan 03 , 2026 | 02:29 AM