Avance Technologies: అవాన్స్ టెక్నాలజీస్ చేతికి హైదరాబాద్ కంపెనీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:18 AM
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న పుష్పక్ ఏఐ కంపెనీలో నూరు శాతం వాటాల కొనుగోలుకు అవాన్స్ టెక్నాలజీస్ ఒక...
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న పుష్పక్ ఏఐ కంపెనీలో నూరు శాతం వాటాల కొనుగోలుకు అవాన్స్ టెక్నాలజీస్ ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది. పుష్పక్ ఏఐ కొనుగోలుతో అవాన్స్ టెక్నాలజీస్ అధిక వృద్ధి అవకాశాలున్న విజువల్ ఇంటెలిజెన్స్, ఎడ్జ్ ఏఐ విభాగాల్లో అడు గు పెట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ కొనుగోలుతో పుష్పక్ ఏఐపై అవాన్స్ టెక్నాలజీస్ పూర్తి వ్యూహాత్మక, నిర్వహణాపరమైన అదుపు సాధించగలుగుతుందని అంటున్నారు. పుష్పక్ ఏఐకి ఆటోమోటివ్, ఇన్‌ఫ్రా, తయారీ, స్మార్ట్ సిటీ, లాజిస్టిక్స్, ఆర్థిక సర్వీసుల రంగాల్లో క్లయింట్లున్నారు.
ఇవి కూడా చదవండి
ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?
బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?