Arvind Pharma: అరబిందో చేతికి ఖండేల్వాల్
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:34 AM
స్థానిక అరబిందో ఫార్మా దేశీయ ఫార్ములేషన్స్ మార్కెట్‌లో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా...
నాన్ కేన్సర్ ఫార్ములేషన్ల బిజినెస్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థానిక అరబిందో ఫార్మా దేశీయ ఫార్ములేషన్స్ మార్కెట్‌లో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర కేంద్రంగా పనిచేసే ఖండేల్వాల్ లాబొరేటరీస్ నాన్ కేన్సర్ ఫార్ములేషన్ల వ్యాపారాన్ని రూ.325 కోట్లకు కొనుగోలు చేసింది. తన అనుబంధ సంస్థ అరో ఫార్మా లిమిటెడ్ ద్వారా ఈ కొనుగోలు జరిపింది. గురువారం నుంచే ఈ కొనుగోలు అమల్లోకి వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఈ కొనుగోలుతో దేశీయ పెయిన్ మేనేజ్‌మెంట్, యాంటీ ఇన్‌ఫెక్టివ్ ఫార్ములేషన్ల మార్కెట్‌లో తమ స్థానం మరింత పటిష్ఠమవుతుందని పేర్కొంది. ఖండేల్‌వాల్ లాబొరేటరీస్ దేశీయ ఫార్ములేషన్స్ మార్కెట్‌లో 23 బ్రాండెడ్ ఔషధాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?
బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?