Gold, Silver Rates on Jan 2: ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు.. ఎంతో తెలిస్తే
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:22 PM
శుక్రవారం బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. డిమాండ్ పెరగడం, డాలర్ బలహీనపడటంతో ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: శుక్రవారం బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. డిమాండ్ పెరగడంతో పాటు డాలర్ బలహీనపడటంతో ధరలు అమాంతం పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,140 మేర పెరిగి రూ.1,36,200కు చేరింది. 22 క్యారెట్ గోల్డ్ ధర కూడా సుమారు వెయ్యి మేర పెరిగి రూ.1,24,850కు చేరుకుంది. వెండి ధర కూడా జోరందుకుంది. నిన్నటితో పోలిస్తే నేడు కిలో వెండి ధర ఏకంగా రూ.4 వేల మేర పెరిగి రూ.2,42,000కు చేరింది (Gold, Silver Prices Jan 2).
నగరాల వారీగా చూస్తే చెన్నైలో 24 క్యారెట్ బంగారం స్పాట్ రేటు రేటు అత్యధికంగా రూ.1,37,240గా ఉంది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రూ.1,36,200గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ స్పాట్ 10 గ్రాముల గోల్డ్ రేటు 1,25,800గా ఉంటే, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి నగరాల్లో రూ.1,24,850గా ఉంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2.6 లక్షలకు చేరింది. ముంబై, బెంగళూరులో నగరాల్లో రూ.2.42 లక్షలుగా, హైదరాబాద్‌లో రూ.2.60 లక్షలుగా ఉంది.
ఇక బంగారం ఫ్యూచర్స్ (ఏప్రిల్) ధర రూ.721 మేర పెరిగి రూ.1,40,424కు చేరుకుంది. కిలో వెండి ఫ్యూచర్స్ (మార్చ్) ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒకానొక దశలో దాదాపు 7 వేల మేర పెరిగి రూ. 2,43,443ల గరిష్ఠస్థాయిని తాకింది. ప్రస్తుతం రూ.2,39,041 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది దాదాపు రూ. 3 వేలు ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ స్పాట్ ధర 4,374 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఔన్స్ వెండి స్పాట్ ధర 74.03 డాలర్లుగా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి:
మార్చి వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్.. భారత్‌లోని హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ అనుమతి
పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఏం జరుగుతుందో తెలుసా..