Share News

GRT Jewellers : జీఆర్‌టీ సంక్రాంతి ఆఫర్లు

ABN , Publish Date - Jan 02 , 2026 | 02:26 AM

ప్రముఖ ఆభరణాల సంస్థ సంక్రాంతి పండగ కోసం ప్రత్యేక ఆఫర్లతో సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లో ‘స్వర్ణ సంక్రాం తి’ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది...

GRT Jewellers : జీఆర్‌టీ సంక్రాంతి ఆఫర్లు

స్వర్ణ సంక్రాంతి పేరుతో రెడీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రముఖ ఆభరణాల సంస్థ సంక్రాంతి పండగ కోసం ప్రత్యేక ఆఫర్లతో సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లో ‘స్వర్ణ సంక్రాం తి’ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తమిళనాడులో ‘పోన్‌ పొంగల్‌’ పేరుతో, సింగపూర్‌లో ‘గోల్డెన్‌ ఫెస్టివల్‌’ పేరుతో ఈ ఆఫర్లు లభిస్తాయి. ఈ ఆఫర్ల కింద బంగారు ఆభరణాల వేస్టేజిపై (వీఏ) 20ు వరకు.. డైమండ్‌, అన్‌కట్‌ వజ్రాభరణాలపై డైమండ్‌ విలువలో 25ు వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే సాలిటైర్లపై మాత్రం ఈ తగ్గింపు లభించదు. అలాగే వెండి వస్తువుల వేస్టేజిపై 25ు వరకు, వెండి ఆభరణాల గరిష్ఠ ధరపై 10ు వరకు తగ్గింపు లభిస్తుంది. ప్లాటినం ఆభరణాల తయారీ ఛార్జీల పైనా 30ు తగ్గింపు లభిస్తుందని కంపెనీ తెలిపింది. దక్షిణ భారత్‌లో తమకు ఉన్న 65 షోరూమ్‌లు, సింగపూర్‌లో ఉన్న ఒక షోరూమ్‌లో ఈ ఆఫర్లు లభిస్తాయని జీఆర్‌టీ జువెలర్స్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?

బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?

Updated Date - Jan 02 , 2026 | 02:26 AM