Indian Auto Industry: ఆటో రికార్డు స్పీడ్
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:39 AM
దేశంలో ఆటో రంగం హైస్పీడ్‌లో దూసుకుపోయింది. 2025 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 45.5 లక్షల కార్లు టోకున అమ్ముడుపోయాయి. ఇది ఒక కొత్త రికార్డు. 2024 సంవత్సరంలో విక్రయించిన...
జూ 2025లో 45.5 లక్షల కార్ల విక్రయం
జూ జీఎ్‌సటీ తగ్గింపుతో ద్వితీయార్ధంలో పోటెత్తిన అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశంలో ఆటో రంగం హైస్పీడ్‌లో దూసుకుపోయింది. 2025 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 45.5 లక్షల కార్లు టోకున అమ్ముడుపోయాయి. ఇది ఒక కొత్త రికార్డు. 2024 సంవత్సరంలో విక్రయించిన 43.05 లక్షల కార్లతో పోల్చితే అమ్మకాల్లో ఆరు శాతం వృద్ధి నమోదయింది. ఏడాది ప్రారంభంలో ఆటో రంగం మందకొడిగానే సాగినప్పటికీ ద్వితీయార్ధంలో జీఎ్‌సటీ 2.0 సంస్కరణల్లో భాగంగా కార్లపై సుంకాలు తగ్గించడం అమ్మకాల జోరును పెంచింది. కార్ల తయారీలో అగ్రగామి మారుతి సుజుకీ ఇండియా రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగించడం, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో కంపెనీలు కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేయడం కార్ల మార్కెట్లో జోరును పెంచింది. దీర్ఘ కాలంగా అమ్మకాల్లో ద్వితీయ స్థానంలో ఉన్న హ్యుండయ్ మోటార్ ఇండియాను నాలుగో స్థానానికి నెట్టి మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. మొత్తం అమ్మకాల్లో 55.8ు వాటాతో ఎస్‌యూవీలు అగ్రస్థానంలో ఉండగా జీఎ్‌సటీ ఉత్తేజంతో చిన్న కార్ల అమ్మకాలు పెరిగాయి.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్: వరుసగా ఐదో సంవత్సరం సైతం తాము అమ్మకాల్లో రికార్డును నమోదు చేశామని కంపెనీ ఎండీ, సీఈఓ శైలేశ్ చంద్ర ప్రకటించారు. ప్రధానంగా ఎస్‌యూవీలకు కస్టమర్ల ప్రాధాన్యత పెరిగిందని, దీనికి తోడు స్వచ్ఛమైన, కాలుష్య రహిత కార్ల కొనుగోలుకు వారు మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు. ఏడాది మొత్తం మీద తాము 5.87,218 కార్లు విక్రయించామని, అందులో 81,125 ఈవీలు కూడా ఉన్నాయని, ఈవీ విక్రయాల్లో కూడా రికార్డును నమోదు చేశామని ఆయన వెల్లడించారు.
వివిధ కంపెనీల దేశీయ అమ్మకాలు ఇలా ఉన్నాయి...
మహీంద్రా అండ్ మహీంద్రా ఎగుమతులు సహా డిసెంబర్ నెల అమ్మకాల్లో 25ు వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 86,090 కార్లు విక్రయించింది. దేశీయంగా 23ు వృద్ధితో 50,946 కార్లు విక్రయించింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ 33ు వృద్ధితో 39,333 కార్లు విక్రయించింది. దేశీయ అమ్మకాలు 34,157గా నమోదయ్యాయి.
స్కోడా ఆటో ఇండియా 2025 సంవత్సరంలో రెండింతలు వృద్ధితో 72,665 కార్లు విక్రయించింది. 2024 అమ్మకాలు 35,166 యూనిట్లున్నాయి.
జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 2025 సంవత్సరంలో 19ు వృద్ధితో 70,554 కార్లు విక్రయించింది. డిసెంబర్ విక్రయాలు 6,500.
కియా ఇండియా డిసెంబర్ నెలలో 18,659 కార్లు విక్రయించింది. 2024 డిసెంబర్‌లో విక్రయించిన 8,957 కార్లతో పోల్చితే అమ్మకాల్లో రెండింతలు వృద్ధి నమోదయింది.
ఆడి ఇండియా 2025 సంవత్సరంలో 4,510 కార్లు విక్రయించింది.
రెనో ఇండియా డిసెంబర్ నెలలో 33.4ు వృద్ధితో 3,845 యూనిట్లు విక్రయించింది.
అశోక్ లేలాండ్ వాణిజ్య వాహన విక్రయాలు డిసెంబర్‌లో 27ు పెరిగి 21,533గా నమోదయ్యాయి. దేశీయ అమ్మకాలు 26ు వృద్ధితో 19,855కి చేరాయి.
హీరో మోటో కార్ప్ డిసెంబర్ విక్రయాల్లో 40ు వృద్ధిని ప్రకటించింది. మొత్తం 4,56,479 వాహనాలు విక్రయించింది. వీటిలో దేశీయ అమ్మకాలు 4,19,243 యూనిట్లున్నాయి.
టీవీఎస్ మోటార్ కంపెనీ 50ు వృద్ధితో 4,81,389 వాహనాలు విక్రయించింది. టూ వీలర్ విక్రయాల్లో 48ు వృద్ధి నమోదయింది.
మారుతి కొత్త రికార్డు
దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకీ 18.44 లక్షల కార్లు విక్రయించింది. 2014 సంవత్సరంలో విక్రయించిన 17.90 కార్ల రికార్డును బ్రేక్ చేసింది. జీఎ్‌సటీ తగ్గింపు, రూ.12 లక్షల వరకు వార్షికాదాయంపై ఆదాయపు పన్ను తగ్గింప, రెపోరేటు కోతలు అమ్మకాలకు ఉత్తేజం ఇచ్చాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. రుతుపవనాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నట్టయితే ఈ ఏడాది 6-7 శాతం వృద్ధిని నమోదు చేయడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ముందు ఏడాది డిసెంబర్‌తో పోల్చితే 2025 డిసెంబర్‌లో 22.21ు వృద్ధితో 2,17,854 కార్లు విక్రయించినట్టు కంపెనీ తెలిపింది.
చిన్న కార్ల ధర పెంపుపై పరిశీలిస్తాం
మారుతి సుజుకీ చిన్న కార్ల ధర పెంపు విష యం పరిశీలించనున్నట్టు ప్రకటించింది. గత ఏడాది జీఎ్‌సటీ తగ్గింపు సమయంలో జీఎస్‌టీ ప్రయో జనాన్ని మించి ధర తగ్గించామని బెనర్జీ అన్నారు. ఇప్పుడు జీఎ్‌సటీ తగ్గింపు ఎంత శాతం ఉందో అంత మేరకే కార్ల ధర తగ్గింపును పరిమితం చేసేలా ధరలను సవరించాలా, వద్దా అన్నది పరిశీలించాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అలాగే తమ దగ్గర ఒకటిన్నర నెలలకు పైగా బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయంటూ ముందుగా కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా డిసెంబర్ 31 వరకు అమలులో ఉన్న ధరలనే వర్తింపచేయాలా, కొత్త ధరలు వసూలు చేయాలా అన్నది కూడా త్వరలో నిర్ణయిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?
బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?