పైపైకి ఎగబాకుతున్న బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Jan 27 , 2026 | 07:28 AM
తగ్గడం అనేదే లేకుండా బంగారం, వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. నిన్న ఉన్న ధర ఈ రోజు ఉండడం లేదు. ఈ రోజు ఉన్న ధర.. రేపు ఉండడం లేదు.
హైదరాబాద్, జనవరి 27: తగ్గడం అనేదే లేకుండా బంగారం, వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. నిన్న ఉన్న ధర ఈ రోజు ఉండడం లేదు. ఈ రోజు ఉన్న ధర.. రేపు ఉండడం లేదు. అంటే.. కొన్ని గంటల్లోనే వీటి ధరలు వేల రూపాయిల్లో పెరిగిపోతున్నాయి. అందుకు ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కానీ మంగళవారం (27-01-2026) బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ వెండి ధరలు మాత్రం రూ. ఒక్కసారి రూ. 12 వేలు పెరిగింది.
గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,61,950గా ఉంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,48,450కి చేరింది. అలాగే హైదరాబాద్‌లో.. కిలో వెండి ధర రూ.3,87,000కి ఎగబాకింది.
ఆయా ప్రధాన నగరాల్లో బంగారం(24కే, 22కే) ధరల వివరాలిలా..
చెన్నై: రూ.1,63,200; రూ.1,49,600
ముంబై: రూ.1,61,950; రూ.1,48,450
న్యూఢిల్లీ: రూ.1,62,100; రూ.1,48,600
కోల్‌కతా: రూ.1,61,950; రూ.1,48,450
బెంగళూరు: రూ.1,61,950; రూ.1,48,450
హైదరాబాద్: రూ.1,61,950; రూ.1,48,450
విజయవాడ: రూ.1,61,950; రూ.1,48,450
కేరళ: రూ.1,61,950; రూ.1,48,450
పుణె: రూ.1,61,950; రూ.1,48,450
అహ్మదాబాద్: రూ.1,62,000; రూ.1,48,500
ప్రముఖ నగరాల్లో వెండి (కిలో) ధరలు వివరాలిలా..
చెన్నై: రూ.3,87,000
ముంబై: రూ.3,70,000
న్యూఢిల్లీ: రూ.3,70,000
కోల్‌కతా: రూ.3,70,000
బెంగళూరు: రూ.3,70,000
హైదరాబాద్: రూ.3,75,100
విజయవాడ: రూ.3,87,000
కేరళ: రూ.3,87,000
పుణె: రూ.3,70,000
అహ్మదాబాద్: రూ.3,70,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. వాటిని కొనే ముందు ధరలను పరిశీలించగలరు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్‌టైం రికార్డు స్థాయికి బంగారం, వెండి దిగుమతుల వ్యయం
For Businees News And Telugu News