ఆల్‌టైం రికార్డు స్థాయికి బంగారం, వెండి దిగుమతుల వ్యయం
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:45 AM
గత ఏడాది బంగారం, వెండి దిగుమతుల వ్యయం సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి పెరిగింది. లండన్‌కు చెందిన పరిశోధన సంస్థ మెటల్ ఫోకస్ డేటా ప్రకారం.. 2025లో భారత్...
2025లో 6,800 కోట్ల డాలర్లకు పెరుగుదల
న్యూఢిల్లీ: గత ఏడాది బంగారం, వెండి దిగుమతుల వ్యయం సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి పెరిగింది. లండన్‌కు చెందిన పరిశోధన సంస్థ మెటల్ ఫోకస్ డేటా ప్రకారం.. 2025లో భారత్ బంగారం దిగుమతుల బిల్లు 5,880 కోట్ల డాలర్లకు, వెండి దిగుమతుల వ్యయం 920 కోట్ల డాలర్లకు (రెండు కలిపి 6,800 కోట్ల డాలర్లు) చేరుకుంది. గత ఏడాది మొత్తం దిగుమతుల వ్యయం 75,000 కోట్ల డాలర్లలో ఈ రెండింటి వాటా 9 శాతంగా ఉంది. ఈ విలువైన లోహాల ధరలు భారీగా పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణం. 2025లో గోల్డ్ రేటు దాదాపు 76 శాతం ఎగబాకగా.. వెండి ధర మూడు రెట్లయింది. కాగా, వీటి దిగుమతుల పరిమాణం మాత్రం తగ్గింది. గత ఏడాది దేశంలోకి 630 టన్నుల బంగారం దిగుమతైందని అంచనా. 2024తో పోలిస్తే 27 తక్కువ. వెండి దిగుమతులు కూడా 6.5 శాతం తగ్గి 7,158 టన్నులకు పరిమితం అయ్యాయి.
ఇవీ చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్! ఈ వారం కూడా దూకుడు తప్పదా..
రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు