ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు..
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:09 AM
కొత్త ఏడాది ఇలా ప్రారంభమైందో లేదో.. అలా గడిచిపోయింది. మరికొన్ని గంటల్లో రెండో మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలల బ్యాంకుల సెలవుల గురించి ఓసారి తెలుసుకుందాం.
నేడు దేశంలో ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలే. బ్యాంకులకు వెళ్లకుండా సెల్‌ఫోన్‌తోనే నగదు లావాదేవీలు జరిగిపోతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. చెక్కు డిపాజిట్, డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) సహా పలు పనుల కోసం తప్పకుండా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే పెద్ద మొత్తంలో నగదు పంపాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అధిక లావాదేవీలు నిర్వహించే వ్యాపారస్థులు సైతం రోజులో ఒక్కసారైనా బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండొచ్చు.
అలా బ్యాంకులకు వెళ్లే వారందరికీ ఏ రోజున బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి? అని తెలుసుకోవడం ముఖ్యం. దానికి అనుగుణంగా తమ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదీకాక.. ఏడాదిలో తక్కువ రోజులు ఉండే మాసం.. ఫిబ్రవరి. ఈ ఏడాది ఈ నెలలో 28 రోజులు మాత్రమే ఉండగా.. దేశవ్యాప్తంగా మొత్తం 9 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయంటే...
ఫిబ్రవరి 1
ఆదివారం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
ఫిబ్రవరి 8..
ఆదివారం. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం.
ఫిబ్రవరి 14..
రెండో శనివారం.. బ్యాంకులకు సాధారణ సెలవు దినం.
ఫిబ్రవరి 15..
ఆదివారం. అన్ని బ్యాంకులకు సెలవు దినం.
ఫిబ్రవరి 18..
లోసర్ పండుగ సందర్భంగా.. సిక్కిం రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ( సిక్కింలో మాత్రమే బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 19..
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉండనుంది. (మహారాష్ట్రలోనే బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 20..
అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు ఉంటుంది. (ఈ రెండు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 22..
ఆదివారం.. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఫిబ్రవరి 28..
నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర బడ్జెట్ గురించి మీరు తప్ప తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే.!
పసిడి, వెండి ధరలు ఢమాల్.. వరుసగా రెండో రోజూ భారీ పతనం
For More Business News And Telugu News