వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరల పెంపు..
ABN , Publish Date - Mar 14 , 2026 | 09:15 AM
ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలను పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) షాక్‌నిచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రూ.3,000లుగా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5 శాతం మేర పెంచుతున్నట్టు పేర్కొంది. తాజా పెంపుతో ఇకపై వార్షిక పాస్ ధర రూ.3,075గా ఉండనుంది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది.
అయితే.. ఫాస్టాగ్ వినియోగదారులు మార్చి 31 లోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయి. అంటే రూ.3,000లకే ఇయర్ పాస్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలం లేదా 200 టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది(ఏది ముందైతే అది). ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేసుకోవచ్చు.
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగా ఈ ధరలను పెంచుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వెల్లడించారు. 2026 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు సుమారు 52 లక్షల మందికిపైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
ఆ పరీక్షా షెడ్యూల్‌పై సీబీఎస్ఈ క్లారిటీ.. ఆ వార్తలు ఫేక్ అని స్పష్టం
AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ