Share News

కీలక ఖనిజాలపై ఎన్‌ఎండీసీ నజర్‌

ABN , Publish Date - Oct 26 , 2026 | 03:58 AM

పశ్చిమాన దక్షిణ అమెరికా నుంచి తూర్పున ఆస్ర్టేలియా వరకు నాలుగు ఖండాల్లో కీలక ఖనిజాలతో పాటు వివిధ ఖనిజాల కోసం ప్రభుత్వ రంగంలోని ఇనుప ఖనిజ దిగ్గజం...

కీలక ఖనిజాలపై ఎన్‌ఎండీసీ నజర్‌

4 ఖండాల్లో అన్వేషణ

న్యూఢిల్లీ: పశ్చిమాన దక్షిణ అమెరికా నుంచి తూర్పున ఆస్ర్టేలియా వరకు నాలుగు ఖండాల్లో కీలక ఖనిజాలతో పాటు వివిధ ఖనిజాల కోసం ప్రభుత్వ రంగంలోని ఇనుప ఖనిజ దిగ్గజం ఎన్‌ఎండీసీ అన్వేషిస్తోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆటోమోటివ్‌, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ర్టానిక్స్‌, ఉక్కు వంటి పరిశ్రమల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ అన్వేషణపై దృష్టిసారించినట్టు పేర్కొన్నాయి. దేశ ఇనుప ఖనిజ అవసరాల్లో నాలుగో వంతును తీరుస్తున్న ఎన్‌ఎండీసీ.. ఇనుప ఖనిజం కాకుండా ఇతర ఖనిజాల విక్రయం ద్వారా కనీసం 20 శాతం రాబడులను ఆర్జించాలన్న లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ అమెరికాలోని చిలీ, ఆస్ర్టేలియా,ఆఫ్రికా, బ్రెజిల్‌, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో లిథియం, కాపర్‌, కోబాల్ట్‌, రేర్‌ ఎర్త్‌ నిక్షేపాల కోసం ఎన్‌ఎండీసీ అన్వేషిస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే యూఏఈ, ఒమాన్‌, భూటాన్‌, ఆస్ర్టేలియా దేశాల్లో సున్నపు గనులు, డోలమైట్‌, కోకింగ్‌ కోల్‌, టంగ్‌స్టన్‌ గనుల కోసం కూడా అన్వేషిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ఖనిజాలను పొందడం ద్వారా భారత్‌లో వృద్ధి పథంలో ఉన్న ఉక్కు, ఆటో, ఎలక్ర్టానిక్స్‌, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్‌, రక్షణ, రైల్వే, మెట్రోస్‌ వంటి ప్రధాన పరిశ్రమల అవసరాలను ఎన్‌ఎండీసీ తీర్చే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 03:58 AM