పసిడి ప్రియులకు ముందే పండగ!
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:30 AM
ఈ దీపావళి, ధనత్రయోదశికి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా గత కొన్ని రోజులుగా దిగొస్తున్న..
భారీగా తగ్గిన విలువైన లోహాల ధరలు
హైదరాబాద్‌లో బంగారం రూ.3,380 డౌన్
రూ.1,38,880కి దిగి వచ్చిన 10 గ్రాముల ధర
రూ.8,000 తగ్గి రూ.2 లక్షలకు జారిన కేజీ వెండి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ దీపావళి, ధనత్రయోదశికి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా గత కొన్ని రోజులుగా దిగొస్తున్న విలువైన లోహాల ధరలు శనివారం భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,38,880కి జారుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.3,100 తగ్గుదలతో రూ.1,27,300గా నమోదైంది. కిలో వెండి ఏకంగా రూ.8,000 పతనమై రూ.2 లక్షలకు దిగివచ్చింది. కాగా, ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాముల ధర రూ.3,200 తగ్గి 10 నెలల కనిష్ఠ స్థాయి రూ.1.42 లక్షల కోట్లకు పరిమితం కాగా.. కేజీ సిల్వర్ రూ.4,200 మేర దిగివచ్చి రూ.1.86 లక్షలకు జారుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. సిల్వర్ 2025 డిసెంబరు 8న ఇదే స్థాయిలో (రూ.1.85 లక్షలు) ట్రేడైంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఏడాది కనిష్ఠానికి ..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు దాదాపు 4 శాతం తగ్గి ఏడాదికి పైగా కనిష్ఠ స్థాయి 3,875 డాలర్లకు పడిపోగా.. సిల్వర్ ఏకంగా 6.20 శాతం క్షీణించి 2025 నవంబరు 6 నాటి కనిష్ఠ స్థాయి 49.12 డాలర్లకు తగ్గింది. తగ్గుదలకు కారణాలివి..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు 110 డాలర్ల ఎగువన ట్రేడవుతుండటంతో పాటు బహిరంగ మార్కెట్లో వస్తు ధరలు పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగించవచ్చన్న అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. ఈ వారంలో నిర్వహించిన పరపతి సమీక్షల్లో ఫెడ్ రిజర్వ్‌తో పాటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించినప్పటికీ, ద్రవ్యోల్బణం ఇప్పట్లో దిగివచ్చే అవకాశాలు లేకపోవడంతో వడ్డీ రేట్లపై కఠిన వైఖరి కొనసాగుతుందని స్పష్టమైన సంకేతాలిచ్చాయి.
ఏఐ బుడగ ఆందోళనలతో టెక్నాలజీ కంపెనీల షేర్లు భారీగా క్షీణించడంతో ఇన్వెస్టర్లు విలువైన గోల్డ్, సిల్వర్ పొజిషన్లను కూడా అమ్మేసి నగదు సమీకరిస్తున్నారని, ముఖ్యంగా చైనాలో ఈ ట్రెండ్ ఎక్కువగా కన్పిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, ఏఐ బుడగ పేలితే ఎలకా్ట్రనిక్స్ రంగం నుంచి డిమాండ్ తగ్గవచ్చన్న భయాలతో వెండి భారీగా పతనమైంది.
ప్రపంచంలో బంగారం లోహం అత్యధికంగా వినియోగించే ఆసియా దేశాలైన చైనా, భారత్‌లో గిరాకీ స్తబ్ధుగా ఉండటం కూడా మరో కారణం. పసిడి రేటు మరింత తగ్గుతుందేమోనన్న ఆశతో భారతీయ కొనుగోలుదారుల్లో చాలామంది వేచి చూస్తున్నారని ఆభరణాల విక్రేతలంటున్నారు.

ధనత్రయోదశి కొనుగోళ్లకు సువర్ణావకాశం
ఈ ధనత్రయోదశికి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి, దీర్ఘకాలిక వ్యూహంతో విలువైన లోహాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికిదే మంచి అవకాశమని అర్థ భారత్ ఇన్వె్‌స్టమెంట్ మేనేజర్స్ ఐఎ్‌ఫఎ్‌ససీ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకులు, గ్రూప్ సీఈఓ సచిన్ సావరికర్ అన్నారు.
ఆల్‌టైం గరిష్ఠం నుంచి పసిడి 27 శాతం డౌన్
ఈ ఏడాది జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠాలతో పోలిస్తే దేశీయంగా బంగారం 27 శాతం, వెండి 58 శాతం నష్టపోయాయి. గడిచిన రెండు నెలల్లో విలువైన లోహాలు మరింత వేగంగా తగ్గుతూ వచ్చాయి. ఆగస్టు 31న రూ.1,60,900 స్థాయిలో ఉన్న 10 గ్రాముల పసిడి సెప్టెంబరు లో రూ.11,600 తగ్గింది. అలాగే, సెప్టెంబరు 30న రూ.1,49,300గా నమోదైన బంగారం ధర.. అక్టోబరులో రూ.7,300 తగ్గి రూ.1.42 లక్షలకు జారుకుంది. కాగా, వెండి సెప్టెంబరులో రూ.13,500, అక్టోబరులో ఏకంగా రూ.46,000 తగ్గింది.
ధరలు మళ్లీ పెరుగుతాయా..?
గోల్డ్, సిల్వర్ ధరల్లో ప్రస్తుత దిద్దుబాటుకు మార్కెట్లో ఇన్వెస్టర్ల అధిక స్పెక్యులేషన్లే కారణమని, వీటి రేట్లు మళ్లీ పెరగవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో మధ్యంతర ఎన్నికల ముందు బులియన్‌లో షార్ట్ పొజిషన్స్ బాగా పెరిగాయని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ సర్కారు మెజారిటీ దక్కించుకుంటుందా..? లేదా..? అన్నది కూడా బులియన్ రేట్ల భవిష్యత్ గమనానికి కీలకంగా మారిందని వారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News