Share News

కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుస సెలవులు

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:14 AM

బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఏకంగ నాలుగు రోజుల పాటు సెలవులు రానున్న నేపథ్యంలో వినియోగదారులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుస సెలవులు
Jan 24 to 27 Holidays

న్యూఢిల్లీ, జనవరి 22: కొత్త ఏడాది ప్రారంభమైంది. జనవరి మాసంలో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే.. సంక్రాంతి పండగకు ఊరు వెళ్లి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని పలువురు భావించారు. అలా ఊరు వెళ్లి వచ్చిన వారు.. మళ్లీ స్వస్థలాలకు చేరుకున్నారు. పనుల్లో నిమగ్నమై వస్తువుల కొనుగోలును వాయిదా వేశారు. అలాంటి వారు వెంటనే అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.

జనవరి 24 నుంచి 27వ తేదీ వరకు వరుసగా.. బ్యాంకులు మూతపడనున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే.. జనవరి 24న నాలుగో శనివారం, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం, 27న సమ్నె కారణంగా బ్యాంకులు బంద్. ఈ నేపథ్యంలో.. ఆర్థిక లావాదేవీల నిమిత్తం వినియోగదారులు కాస్త అలర్టై.. బ్యాంక్ పనులను చూసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


24 నుంచి 26వ వరకు బ్యాంకు సెలవులంటే ఓకే.. కానీ 27న బ్యాంకుల బంద్‌ ఎందుకనే ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. తమకు వారంలో.. ఐదు పనిదినాలు కల్పించాలని బ్యాంక్ సిబ్బంది కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆరోజున దేశవ్యాప్తంగా బ్యాంక్‌ల బంద్‌కు పిలుపునిచ్చాయి బ్యాంకింగ్ సంఘాలు. ఈ విషయమై గతంలోనే బ్యాంక్ ఉద్యోగులు పలుమార్లు సమ్మె చేపట్టారు. అప్పట్లో ఈ అంశంపై చర్చలు జరిగినా.. వారి డిమాండ్ మాత్రం నేటికీ నెరవేరలేదు. ఈ నేపథ్యంలోనే మంగళవారం మరోసారి సమ్మెకు దిగనున్నారు.


మరోవైపు.. విదేశీ మారక ద్రవ్య మార్కెట్, ద్రవ్య మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజీలు శనివారాల్లో పని చేయవు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సైతం శనివారం పని చేయవు. ఈ నేపథ్యంలో బ్యాంకులు.. వారంలో ఐదు రోజులు పని దినాలను ఎందుకు అమలు చేయవని కేంద్రాన్ని యఎఫ్‌బీయూ(యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) సూటిగా ప్రశ్నిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి.. బంగారం, వెండి ధరలు

సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత.. ఎప్పటినుంచంటే.?

For More Business News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 12:43 PM