Share News

Vastu Tips for Pooja: పూజలో ఈ తప్పులు చేస్తే ఫలితం ఉండదు.!

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:20 PM

ఇంట్లో పూజ చేసే సమయంలో తెలియకుండానే చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. అయితే, ఇవి పూజ ఫలితాలపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కాబట్టి, పూజ సమయంలో చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips for Pooja:  పూజలో ఈ తప్పులు చేస్తే ఫలితం ఉండదు.!
Vastu Tips for Pooja

ఇంటర్నెట్ డెస్క్: పూజ చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. అయితే, ఇవి పూజ ఫలితాలపై ప్రభావం చూపుతాయి. సరైన విధంగా పూజ చేస్తే మన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి, పూజ సమయంలో చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పూజ గది దిశ

వాస్తు ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో లేదా ఈశాన్య మూలలో ఉండాలి. ఈ దిశలో పూజ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, పూజకు మంచి ఫలితం లభిస్తుంది. బెడ్‌రూమ్‌లో, వంటగదిలో లేదా మెట్ల కింద పూజ గదిని ఏర్పాటు చేయకూడదు. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

తప్పు దిశలో కూర్చుని పూజ చేయడం

పూజ చేసే సమయంలో దేవుడి వైపే ముఖం ఉండాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా కూర్చుని పూజ చేయడం మంచిది. తప్పు దిశలో కూర్చుంటే ఏకాగ్రత తగ్గి, పూజ ఫలితం సరిగా దక్కకపోవచ్చు.


పూజ గదిలో అనవసర వస్తువులు పెట్టడం

కొంత మంది ఇళ్లలో పూజ గదిలో పాత క్యాలెండర్లు, ఫొటోలు, ఖాళీ పెట్టెలు లేదా వాడిన ధూపం కర్రలు ఉంటాయి. అయితే, వాస్తు ప్రకారం పూజ గదిలో ఇవి ఉండటం మంచిది కాదు. పూజకు సంబంధించిన శుభ్రమైన వస్తువులు మాత్రమే పూజ గదిలో ఉంచాలి.

ఎక్కువ విగ్రహాలు ఉంచడం

పూజ గదిలో ఎక్కువగా దేవుళ్ల విగ్రహాలు లేదా ఒకే దేవతకు సంబంధించిన అనేక విగ్రహాలు ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే, పూజపై ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి, ఒకటి లేదా రెండు విగ్రహాలు ఉంటే సరిపోతాయి.


ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేయడం

ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేయడం కూడా మంచిది కాదు. ఉదయం లేదా బ్రహ్మ ముహూర్తం పూజకు ఉత్తమ సమయం. ప్రతిరోజూ ఒకే సమయానికి నమ్మకంతో పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. పూజ చేసే సమయంలో వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో శాంతి, ఆనందం, సానుకూల శక్తి పెరుగుతుంది.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)

Also Read:

కీరదోసకాయ వీరు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!

For More Latest News

Updated Date - Jan 06 , 2026 | 03:52 PM