వైసీపీ ‘రైతు ధర్నా’ డ్రామా
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:33 AM
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేవు. నీటి లభ్యత లేదు.
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపునకు స్పందించని రైతులు
అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై షో
ఉరవకొండ, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేవు. నీటి లభ్యత లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాగునీరుకే ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఆయకట్టుకు నీరివ్వాలని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ ‘రైతు ధర్నా’ డ్రామాకు తెరతీసింది. ఇందుకు రైతులు ఎవరూ స్పందించలేదు. జనం రాకున్నా జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యకర్తలతో బైఠాయించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంలో ఆయన చేసిన కుట్రను రైతులు తిప్పికొట్టారు. హంద్రీ-నీవా, హెచ్చెల్సీ, జీబీసీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్న డిమాండ్‌తో ధర్నా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో ఆయన హడావుడి చేశారు. అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై చిన్నముష్టూరు సమీపంలోని హంద్రీ-నీవా కాలువ వంతెనపై శుక్రవారం ధర్నాకు పిలుపునిచ్చారు. ఉదయం 9:30కు రావాలని రైతులను కోరారు. రైతులు ఎవరూ రాలేదు. ఆయన పిలుపునకు వైసీపీ కార్యకర్తల నుంచి కూడా ఆశించిన స్పందన రాలేదు. గంట తరువాత వెంట వచ్చిన కార్యకర్తలతో ఆయన ధర్నా చేశారు. పురుగు మందు డబ్బాలు ఆయన కారుపైనే పెట్టారు. రైతులు రాకపోవడంతో వాటిని కార్యకర్తలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు గమనించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ధర్నా ప్రారంభమైన కాసేపటికే కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లి పోయేందుకు ప్రయత్నించగా, వారిని బతిమలాడి రోడ్డుపై కూర్చోబెట్టారు. విశ్వేశ్వరరెడ్డితో పాటు వైసీపీ నాయకులు 18 మందిపై కేసు నమోదు చేశామని సీఐ మహానంది శుక్రవారం రాత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్