మాపై గెలిచిన మీకు కంగ్రాట్స్!
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:33 AM
రాజకీయాలంటే ఉప్పు నిప్పు కాదని నిరూపించే సంఘటన. ‘ఎన్నికల్లో మాత్రమే మనం ప్రత్యర్థులం. మాపై గెలిచిన మీకు అభినందనలు’ అంటూ ఎంపీటీసీ స్థానంలో గెలిచిన టీడీపీ అభ్యర్థికి వైసీపీ నాయకుడు...
టీడీపీ ఎంపీటీసీకి వైసీపీ అభ్యర్థి తండ్రి అభినందనలు
నంబులపూలకుంట, నవంబరు 9(ఆంధ్రజ్యోతి ): రాజకీయాలంటే ఉప్పు నిప్పు కాదని నిరూపించే సంఘటన. ‘ఎన్నికల్లో మాత్రమే మనం ప్రత్యర్థులం. మాపై గెలిచిన మీకు అభినందనలు’ అంటూ ఎంపీటీసీ స్థానంలో గెలిచిన టీడీపీ అభ్యర్థికి వైసీపీ నాయకుడు శుభాకాంక్షలు చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లాలో నంబులపూలకుంట-1 ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి సైదాబాను, వైసీపీ అభ్యర్థి అనూషపై 80 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలో అనూష తండ్రి ఆంజనేయులురెడ్డి ఆదివారం సైదాబాను ఇంటికి వెళ్లారు. ఆమెను అభినందించి, ఆమె భర్త అజంతుల్లాకు పూలమాల వేసి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. అజంతుల్లా దంపతులు కూడా ఆంజనేయులు రెడ్డిని సత్కరించారు. ‘సైదాబాను కూడా మీ బిడ్డలాంటిదే. ఇంకో కూతురు గెలిచిందని భావించండి’ అని ఆంజనేయులురెడ్డితో అజంతుల్లా అన్నారు.
ఈ వార్తలనూ చదవండి: