Share News

యలహంక ప్యాలెస్ భూవివాదంలో కోర్టు కీలక ఉత్తర్వులు.. షర్మిలకు ఎదురుదెబ్బ

ABN , Publish Date - Nov 21 , 2026 | 08:33 PM

యలహంక ప్యాలెస్ భూవివాదంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కేసులో షర్మిలకు సంబంధించిన వివాదంపై ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది.

యలహంక ప్యాలెస్ భూవివాదంలో కోర్టు కీలక ఉత్తర్వులు.. షర్మిలకు ఎదురుదెబ్బ
Yelahanka Palace

అమరావతి, నవంబరు 21: యలహంక ప్యాలెస్‌కు సంబంధించిన భూవివాదంలో న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కేసులో ఇంజక్షన్ ఉత్తర్వులు మంజూరు చేస్తూ వివాదాస్పద స్థలానికి సంబంధించి తాత్కాలిక నిషేధాజ్ఞలు విధించింది.

ఈ మేరకు ప్రతివాది షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు.. అనుచరులు వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది. స్థలంలోకి వెళ్లడం, అక్కడ ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయడం, ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించడం చేయరాదని స్పష్టం చేసింది. భూవివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


అంతేకాకుండా వివాదాస్పద స్థలంలో ఉన్న చెట్లు, నిర్మాణాలు, ఇతర ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేసు తుది పరిష్కారం అయ్యే వరకు ఆస్తి విషయంలో షర్మిల జోక్యం చేసుకోరాదని పేర్కొంది. అలాగే ఆమె కుటుంబ సభ్యులు.. అనుచరులు కూడా స్థలానికి సంబంధించి ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు కేసు తుది తీర్పు కాదని, విచారణ పూర్తయ్యే వరకు ఆస్తి యథాతథ స్థితిని కాపాడేందుకు విధించిన తాత్కాలిక ఆంక్షలుగా చూడాల్సి ఉంటుంది. యలహంక ప్యాలెస్ భూవివాదంలో కోర్టు తాజా ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి..

ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి

ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 09:00 PM