Share News

రూ.40 కోట్ల విలువైన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:44 PM

తాడిపత్రిలో రూ.40 కోట్ల విలువైన 6 ఎకరాల 75 సెంట్ల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలు కాజేశారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ తాడిపత్రి రిజిస్ట్రేషన్ శాఖ డీజీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

రూ.40 కోట్ల విలువైన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఇంటర్‌నెట్ డెస్క్: తాడిపత్రిలో రూ.40 కోట్ల విలువైన 6 ఎకరాల 75 సెంట్ల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలు కాజేశారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ తాడిపత్రి రిజిస్ట్రేషన్ శాఖ డీజీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ బసవరాజు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు.


కేతిరెడ్డి కూడా భూకబ్జాకు పాల్పడ్డారు..

అలాగే, గత ప్రభుత్వంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా 2 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇల్లు నిర్మించుకున్నారని జేసీ ఆరోపించారు. అయినా ఆయనపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. తాడిపత్రిలో ఈ భూ వివాదంలో డిప్యూటీ తహసీల్దార్ సోమశేఖర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, వీఆర్ఓ వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ మహమద్ షఫిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.


Also Read:

గురువులపై దాడి ఘటన.. ఏపీ ప్రభుత్వం సీరియస్

ఆసియా క్రీడలు: స్విమ్మింగ్‌లో స్వర్ణం.. 13 ఏళ్లకే చైనా అథ్లెట్ రికార్డు

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు

Updated Date - Sep 21 , 2026 | 04:44 PM