Share News

అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది: మంత్రి నాదెండ్ల

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:19 PM

అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు పన్నుతోందని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో ఎన్నో విధ్వంసాలు జరిగాయని ఆయన అన్నారు.

అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది: మంత్రి నాదెండ్ల
Nadendla Manohar

అమరావతి, జూన్ 27: అమరావతిలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇటీవల తమ పర్యటనలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి ఆ పార్టీ నాయకుడు జగన్ రెడ్డికి అమరావతిపై ఎంత కక్ష ఉందో అర్థమవుతోందని తెలుస్తోందన్నారు. రైతులపై దండయాత్రలా వెళ్లి రాళ్ల దాడికి దిగడాన్ని రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, జగన్ రెడ్డి పాలన ఈ ప్రాంతంలో విధ్వంసంతో ప్రారంభమైందని విమర్శించారు.


ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ భూములు త్యాగం చేసిన రైతులను రోడ్డు మీదకు తెచ్చిందీ వైసీపీ ప్రభుత్వం. అమరావతి ప్రాంతంలో రైతులు నిరసనలు తెలుపుతుంటే అప్రజాస్వామికంగా వ్యవహరించింది. మహిళా రైతులను తీవ్రంగా అవమానించారు. జగన్ మెప్పు కోసం కొందరు నాయకులు ఈ ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చారు. మూడు రాజధానుల విధానాన్ని రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తిరస్కరించారు. ఇప్పుడు జగన్ ‘మావిగన్’ అనే విచిత్రమైన రాజధాని గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అమరావతిలో చిన్నపాటి నిర్మాణం కూడా జరగలేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రానికి బలమైన రాజధానిగా అమరావతి ఉండాలనే ఉద్దేశంతో పనులను వేగవంతం చేశారు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి...

వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి: సీఎం చంద్రబాబు

ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకల దాడే: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 07:17 PM