పోలీసులకు చిక్కిన నకిలీ కరెన్సీ ముఠా.. పక్కా ప్లాన్‌తో అడ్డంగా బుక్కయ్యారు..
ABN , Publish Date - Apr 06 , 2026 | 08:35 PM
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన కొవ్వూరి గోపిచంద్రారెడ్డి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వేముల మోహనసాయి, బర్రె సుధీర్ అనే వ్యక్తులు మార్కెట్‌లో ఫేక్ కరెన్సీ సరఫరా చేస్తున్నారు. అయితే, రూ.లక్షకు రూ.3లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామని భీమవరానికి చెందిన శివశంకర్‌ను ఈ ముఠా నమ్మించింది.
పశ్చిమ గోదావరి: జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఫేక్ కరెన్సీ మార్చుకునేందుకు వచ్చిన ముఠా పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. నిందితుల నుంచి రూ.2 కోట్లపైగా నకిలీ నగదును స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ప్లాన్ వేసి ముఠా సభ్యులకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఈ ఘటన జిల్లా కేంద్రం భీమవరంలో జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన కొవ్వూరి గోపిచంద్రారెడ్డి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వేముల మోహనసాయి, బర్రె సుధీర్ అనే వ్యక్తులు మార్కెట్‌లో ఫేక్ కరెన్సీ సరఫరా చేస్తున్నారు. అయితే, రూ.లక్షకు రూ.3లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామని భీమవరానికి చెందిన శివశంకర్‌ను ఈ ముఠా నమ్మించింది. రూ.3 లక్షలు ఇస్తే రూ.9 లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. అయితే, ఫేక్ కరెన్సీకి బదులుగా డమ్మీ కరెన్సీని చూపించారు ముఠా సభ్యులు. అనుమానం వచ్చి పోలీసులకు శివశంకర్ సమాచారం ఇచ్చారు. పక్కా పథకం ప్రకారం నోట్లు మార్పిడి జరిగే ప్రాంతంలో పోలీసులు మాటు వేశారు.
కరెన్సీ మార్చుకునే సమయంలో చాకచక్యంగా ముఠాను అరెస్టు చేశారు. గోపిచంద్రారెడ్డి, వేముల మోహనసాయిని అరెస్టు చేయగా.. బర్రె సుధీర్ పరారయ్యాడు. వారి నుంచి రూ.2.9 కోట్ల విలువగా చూపించే డమ్మీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారును సీజ్ చేశారు. కాగా, పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
పిఠాపురం ప్రజలకు గుడ్ న్యూస్.. పవన్ చొరవతో రూ.37.25 కోట్లు విడుదల
విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..