Share News

బాల్యవివాహాల నిర్మూలనకు కమిటీలను ఏర్పాటు చేయాలి: గాంధీబాబు

ABN , Publish Date - Apr 28 , 2026 | 02:53 PM

చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందించే పౌష్టికాహారంలో ఎలాంటి అవకతవకలకూ పాల్పడొద్దని రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యుడు వి.గాంధీబాబు హెచ్చరించారు.

బాల్యవివాహాల నిర్మూలనకు కమిటీలను ఏర్పాటు చేయాలి:  గాంధీబాబు
Anganwadi inspection

ఏలూరు జిల్లా, ఏప్రిల్ 28: చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందించే పౌష్టికాహారంలో ఎలాంటి అవకతవకలకూ పాల్పడొద్దని రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యుడు వి.గాంధీబాబు హెచ్చరించారు. వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. రాష్ట్ర కమిషన్ ఆదేశాల మేరకు.. ఆయన కైకలూరు, మండవల్లి మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, కైకలూరు సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, వైద్య సేవలు, ప్రత్యేక వార్డుల పరిస్థితులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ కట్టుబడి ఉందని, వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని గాంధీబాబు పేర్కొన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. అలానే గ్రామాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.


ఇవి కూడా చదవండి..

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్

మా ఫోన్‌లను హ్యాక్ చేస్తున్నారు.. ఎవరినీ వదలం: హరీశ్ రావు

Updated Date - Apr 28 , 2026 | 03:37 PM