Share News

ఏలూరు జిల్లాకు సీఎం చంద్రబాబు.. పర్యటన షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Aug 08 , 2026 | 09:52 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు ప్రజా వేదిక, క్యాడర్ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.

ఏలూరు జిల్లాకు సీఎం చంద్రబాబు.. పర్యటన షెడ్యూల్ ఇదే..
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు ప్రజా వేదిక, క్యాడర్ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజు ఉదయం 10:45 గంటలకి కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు చేరుకుంటారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు కలిదిండి తహసీల్దార్ కార్యాలయానికి ఆయన చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారాల దిశగా చర్యలు చేపడతారు. ఆ తర్వాత కలిదిండిలో ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించనున్నారు. ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 2:05 వరకు ప్రజా వేదిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.


మధ్యాహ్నం 2:55 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. 2:55 నుంచి సాయంత్రం 4:25 వరకు క్యాడర్ సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4:35 గంటలకు కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం 4:40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4:55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Aug 08 , 2026 | 10:08 PM