పోలవరం ప్రాజెక్టు పర్యాటక అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష..
ABN , Publish Date - Jul 14 , 2026 | 08:09 PM
పోలవరం ప్రాజెక్టు పర్యాటక అభివృద్ధిపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు సహా పరిసర ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై ఇరిగేషన్ శాఖ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన కీలకంగా చర్చించారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పర్యాటక అభివృద్ధిపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు సహా పరిసర ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై ఇరిగేషన్ శాఖ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ మేరకు ప్రాజెక్టు పనులకు అనుబంధంగా పర్యాటక పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం నుంచి ఎగువన ఉన్న భద్రాచలం సమీపం వరకు పర్యాటక అభివృద్ధిపై అధికారులతో కీలక చర్చ జరిపారు. ఏపీ పరిధిలో గోదావరి నదికి, ప్రాజెక్టుకు ఇరువైపులా పర్యాటక అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. సమృద్ధిగా నీటి వనరులు, పచ్చని కొండలు, అటవీ ప్రాంతాలతో పోలవరం మంచి పర్యాటక కేంద్రంగా నిలిచే అవకాశం ఉందని అధికారులకు సీఎం తెలిపారు. పలు ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యాటక రంగంలోనూ పోలవరం ఖ్యాతిని చాటేలా ప్రణాళిక ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా రివర్‌ఫ్రంట్ టూరిజం, అడ్వెంచర్ టూరిజానికి ఈ ప్రాంతం అత్యంత అనుకూలమని నిప్పాన్ కోయి ఇండియా సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్‌కు సమృద్ధిగా ఉన్న అవకాశాలను ఆయనకు వెల్లడించారు. అనంతరం కేబుల్-స్టేడ్ బ్రిడ్జి డిజైన్, స్పిల్‌వే బ్యూటిఫికేషన్‌తో పాటు మాస్టర్ ప్లాన్‌పై ఆ సంస్థ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే పోలవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిపై కీలక విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కన్నుమూత..
మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్న