మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:14 PM
విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని అన్నారు.
అమరావతి: విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని, విపత్తుల కారణంగా మొత్తం 270 మంది మృతిచెందారని పేర్కొన్నారు. అయితే, జగనే వారిని చంపేశారని అంత అవివేకంగా తాము మాట్లాడమని అన్నారు. నాడు మృతిచెందిన 270 మందిలో ఏ ఒక్క కుటుంబాన్ని ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని జగన్‌ను మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..'గొడ్డలి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ పర్యటనకు వెళ్లారు. మీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఓ వ్యక్తిని తన వాహనంతో ఢీకొట్టాడు. వైద్యం చేయించకపోవడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తిని పలకరించడానికి వెళతావేమో అనుకున్నా. గొడ్డలి పార్టీ అబద్ధాల పునాదులపై పుట్టింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల విశాఖలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. అలాంటి విపత్తుల సమయంలో వెంటనే స్పందించి వారి ప్రాణాలు కాపాడే చరిత్ర సీఎం చంద్రబాబు నాయుడిది. ప్రభుత్వం వెంటనే స్పందించినా సాంకేతిక కారణాల వల్ల మత్స్యకారుల బోటు ఎక్కడ మునిగిపోయిందో తెలియక కాపాడలేకపోయాం.
ఈ నెల 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు బోటు గల్లంతైనట్లు మాకు సమాచారం అందింది. ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి బోటుకు ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేశాం. విపత్తు వచ్చినప్పుడు ట్రాన్స్‌పాండర్‌ను నొక్కితే సమాచారం తెలుస్తుంది. ట్రాన్స్‌పాండర్‌ను నొక్కిన వెంటనే వారు ఏ ప్రాంతానికి వెళ్లారో తెలుసుకుని, 11:30 గంటలకు కోస్ట్ గార్డ్, నేవీకి సమాచారం ఇచ్చి ఆపరేషన్ ప్రారంభించాం. నేడు కిలోమీటర్లకు, నాటికల్ మైళ్లకు తేడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారు. 11 నాటికల్ మైళ్ల దూరంలో సంఘటన జరిగింది. వెంటనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బాధిత కుటుంబసభ్యుల వద్దకు, పోర్టు వద్దకు పంపాం. 30 ఏళ్లుగా ఏ సంఘటన జరిగినా వెంటనే అక్కడ ఉండే వ్యక్తి అచ్చెన్నాయుడు. నీ పాలనలో 270 మంది చనిపోతే కనీసం పరిహారం ఇవ్వలేదు.
వైసీపీ అధికారం కోల్పోయాక ఎన్డీఏ ప్రభుత్వం ఆ పరిహారం ఇచ్చింది. మీకు తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయి లేరు.. అందర్నీ చంపేస్తావు. చిన్నా, పెద్దా తేడా లేకుండా మీ మంత్రి (సీదిరి అప్పలరాజు) నాడు మాట్లాడారు. మీ మాజీ మంత్రి కుమారుడు ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతోనే దానయ్య చనిపోయారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చి ఉంటే దానయ్య బతికేవారు. మేము మాత్రం గల్లంతైన ఏడుగురిలో ఓ మత్స్యకారుడిని సురక్షితంగా కాపాడాం. ఆస్పత్రికి తరలించి మంచి చికిత్స అందించాం. జగన్ చేసే చౌకబారు వ్యాఖ్యలను నమ్మేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు' అని మంత్రి అచ్చెన్న చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య
ఏపీలో సర్ గడువు తేదీ పొడిగింపు.. ఈసీఐ ఆదేశాలు జారీ..