ఇంధన కొరత లేకుండా సమీక్షలు నిర్వహిస్తున్నాం: మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - May 15 , 2026 | 01:04 PM
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకున్న నేపథ్యంలో ఇంధన ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఏలూరు, మే 15: ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకున్న నేపథ్యంలో ఇంధన ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలపై రూ.3 పెంచాయని వివరించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఇంధన కొరత లేకుండా.. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ఉండేందుకు సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇంధన ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యగా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన స్పష్టం చేశారు. బాధ్యత గల పౌరులుగా ప్రతీ ఒక్కరూ ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై నియంత్రణ ఉండేలా నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు అధ్యక్షులను నియమించిన ఏపీ బీజేపీ చీఫ్
ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి లోకేశ్
For More AP News And Telugu News