Share News

సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:52 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాతికేళ్ల ప్రజా సేవ నేపథ్యంలో 17 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర బీజేపీ ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • బీజేపీ రాష్ట్ర నేతలతో సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాతికేళ్ల ప్రజా సేవ నేపథ్యంలో 17 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర బీజేపీ ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాన్ని వివరించేందుకు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ నేతృత్వంలోని బృందం శనివారం సీఎంతో భేటీ అయింది. సేవా సంకల్ప్‌ అభియాన్‌ గురించి మాధవ్‌ వివరించారు. స్పందించిన చంద్రబాబు... ‘కేంద్రం నుంచి అందుతున్న సహకారం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి’ అని బీజేపీ నేతలకు సూచించారు.

విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించాలి

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17న విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 05:52 AM