ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:03 AM
కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలోని పేద, సామాన్య ప్రజ లకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒంగోలు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను శనివారం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం
జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించిన మంత్రి స్వామి
పాల్గొన్న ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలోని పేద, సామాన్య ప్రజ లకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒంగోలు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను శనివారం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న రోగులకు తక్షణమే అత్యున్నత స్థాయి అత్యవసర వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారం భించడం శుభపరిణామమన్నారు. అత్యాధునిక సాంకే తిక పరిజ్ఞానం, అన్ని సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ సెంటర్ పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు మెరుగైన వైద్యం అందించడంపైనే ప్రధా నంగా దృష్టి సారించారని తెలిపారు. సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న అనేక పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తు న్నారన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రజాప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ, సంజీవని పథకాల ద్వారా ప్రజల ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పిస్తున్నదని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు తల్లీ, బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తు న్నామనితెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా కొండ పి, అద్దంకిలో నూతనంగా డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశామని మంత్రి స్వామి వెల్లడించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలులో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు కావడం జిల్లా ప్రజలకు వరం లాంటిందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు అత్యవసర వైద్యం కోసం గతంలో గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్‌సెంటర్ ద్వారా మరింత ధైర్యం లభిస్తుందని తెలిపారు. కార్పొరేట్ వైద్యానికి తీసిపోని విధంగా ఇక్క డ అన్ని ఆధునిక వైద్యపరికరాలతో అత్యవసర వైద్యం లభిస్తుందని స్పష్టం చేశారు. సంతనూతలపాడు ఎమ్మె ల్యే బీఎన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం, సూపర్‌స్పెషాలిటీ సేవలు లభిస్తున్నాయని తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్‌లు వర్చువల్ విధానంలో సీసీబీని ప్రారంభిం చారు. కార్యక్రమంలోపీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి శీతారామయ్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, జేసీ కల్పనాకుమారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు, డిప్యూటీ సూపరింటెంటెండ్ డాక్టర్ నామినేని కిరణ్‌కుమార్, ఏఆర్‌ఎంవో డాక్టర్ సునీల్ గవాస్కర్‌తోపాటు పలువురు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.