Share News

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:01 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. స్థానిక రామనగ ర్‌లోని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ కార్యాలయంలో శనివారం ఒంగోలు పార్లమెంట్‌ ఎన్నికల కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరిగింది.

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఉగ్ర, కూటమి పార్టీల నేతలు

కూటమి పార్టీల సమావేశంలో నిర్ణయం

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. స్థానిక రామనగ ర్‌లోని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ కార్యాలయంలో శనివారం ఒంగోలు పార్లమెంట్‌ ఎన్నికల కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అధ్యక్షత వహించగా బీజేపీ ప్రకాశం, మార్కాపురం జిల్లాల అధ్యక్షులు శెగ్గం శ్రీనివాసరావు, పీవీ కృష్ణారావు, జనసేన ఎన్నికల కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు పెద్దపూడి విజయకుమార్‌, రాయపాటి అరుణ, వరికూటి నాగరాజు, టీడీపీ ఒంగోలు పార్లమెం ట్‌ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీల అధిష్ఠానా లు ఇచ్చిన దిశానిర్దేశాలతోపాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. అందుకోసం మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. ఎన్నికలకు పార్టీశ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావా లని, గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. పరస్పర సమన్వయం, సహకారంతో పనిచేస్తూ ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గస్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని పటిష్టంగా అమలుచేయ డంతోపాటు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 03:01 AM