Share News

కొబ్బరి నూనెతో...

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:09 AM

స్వచ్చమైన కొబ్బరి నూనెతో చిన్న చిట్కాలు పాటించి చర్మాన్ని, శిరోజాలను సంరక్షించుకోవచ్చు. ఎలాగంటే...అరచేతిలో కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని రెండో అర చేత్తో వేగంగా రుద్ది ఆపైన మాడు నుంచి శిరోజాల చివరి వరకు అప్లయ్‌ చేయాలి.

కొబ్బరి నూనెతో...

స్వచ్చమైన కొబ్బరి నూనెతో చిన్న చిట్కాలు పాటించి చర్మాన్ని, శిరోజాలను సంరక్షించుకోవచ్చు. ఎలాగంటే...అరచేతిలో కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని రెండో అర చేత్తో వేగంగా రుద్ది ఆపైన మాడు నుంచి శిరోజాల చివరి వరకు అప్లయ్‌ చేయాలి. ఇలా తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మెరుస్తాయి.

తరచూ ముఖ చర్మం పొడిబారుతుంటే రెండు చుక్కల కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్‌లా ఉపయోగించవచ్చు. చెంచా కొబ్బరి నూనెలో పావు చెంచా చక్కెర కలిపి పెదవులపై స్క్రబ్‌లా వాడితే మృత కణాలు తొలగి పోతాయి. రక్తప్రసరణ పెరిగి, తేమ నిండి పెదవులు ఛాయగా మారతాయి.స్నానం చేసిన వెంటనే మోచేతులు, మోకాళ్లు, పాదాల మీద కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటే వాటిమీద పేరుకున్న నలుపుదనం తొలగిపోతుంది.పాదాల మడమలు పొడిబారి లోతుగా పగిలినప్పుడు గోరువెచ్చగా వేడిచేసిన కొబ్బరి నూనె రాసి సాక్స్‌ వేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.మేక్‌పను తొలగించేందుకు కొబ్బరి నూనెలో ముంచిన దూదితో ముఖాన్ని నెమ్మదిగా రుద్ది ఆపైన క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Updated Date - Sep 12 , 2026 | 12:09 AM