జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్‌తో ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వక భేటీ..
ABN , Publish Date - Aug 06 , 2026 | 09:12 PM
జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావుతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ (శుక్రవారం) భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని జీఎంఆర్ కార్పొరేట్ కార్యాలయంలో గ్రంధి మల్లికార్జునరావుని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఢిల్లీ: జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావుతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ (శుక్రవారం) భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని జీఎంఆర్ కార్పొరేట్ కార్యాలయంలో గ్రంధి మల్లికార్జునరావుని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన ఆ సంస్థకు కలిశెట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. సీఎం నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం, కేంద్రం సహకారంతోనే భోగాపురం ప్రాజెక్టు సాకారమైందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రధాన ద్వారమని అన్నారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి, పెట్టుబడులు, పర్యాటక రంగాలు వేగంగా విస్తరిస్తాయని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విమానాశ్రయం చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని, ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని కొనియాడారు.
పారిశ్రామిక ప్రగతి, పర్యాటక రంగాల విస్తరణకు బలమైన పునాది అవుతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జీఎంఆర్ సంస్థకు ఆయన మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు కూడా చదవండి...
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు