Share News

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:26 AM

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..
Road Accident in Visakhapatnam

విశాఖ: ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.


ఈ ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ప్రమాద తీరును పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

రూ.29వేల కోట్లతో షిప్‌బిల్డింగ్‌ యాంకర్‌

ఆరోగ్యశాఖకు రెండు జాతీయ అవార్డులు

Updated Date - Jul 19 , 2026 | 09:58 AM