Share News

ఆరోగ్యశాఖకు రెండు జాతీయ అవార్డులు

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:35 AM

రాష్ట్ర ఆరోగ్యశాఖను రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఢిల్లీలో శుక్ర, శనివారాల్లో ఆయుష్మాన్‌ భారత్‌పై జరిగిన సమీక్షలో ఈ అవార్డులను..

ఆరోగ్యశాఖకు రెండు జాతీయ అవార్డులు

అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆరోగ్యశాఖను రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఢిల్లీలో శుక్ర, శనివారాల్లో ఆయుష్మాన్‌ భారత్‌పై జరిగిన సమీక్షలో ఈ అవార్డులను జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రకటించింది. ‘ఆయుష్మాన్‌ వయో వందన’లో అత్యధిక కార్డులు నమోదు చేసినందుకు, అత్యధిక ఆరోగ్య రికార్డులను అనుసంధానించినందుకు అవార్డులు లభించాయి. దీనిపై అధికారులను మంత్రి సత్యకుమార్‌ అభినందించారు.

Updated Date - Jul 19 , 2026 | 05:36 AM