Share News

రూ.29వేల కోట్లతో షిప్‌బిల్డింగ్‌ యాంకర్‌

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:32 AM

దుగరాజపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణంలో ప్రధానమైన యాంకర్‌ పోర్టు పనుల్లో భాగస్వామ్యం వహించేందుకు కేంద్ర రక్షణశాఖ ముందుకు వచ్చింది.

రూ.29వేల కోట్లతో షిప్‌బిల్డింగ్‌ యాంకర్‌

  • దుగరాజపట్నం పోర్టుకు రక్షణశాఖ సహకారం

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): దుగరాజపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణంలో ప్రధానమైన యాంకర్‌ పోర్టు పనుల్లో భాగస్వామ్యం వహించేందుకు కేంద్ర రక్షణశాఖ ముందుకు వచ్చింది. శ్రీహరికోటకు సమీపంలో దుగరాజపట్నం పోర్టులో 29,263 కోట్ల వ్యయంతో యాంకర్‌ షిప్‌బిల్డింగ్‌తోపాటు, డ్రెడ్జింగ్‌, బ్యాక్‌వాటర్‌ వంటి పనులకు రూ.3000 కోట్ల దాకా ఆర్థిక సాయమందించేందుకు సమ్మతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణం కోసం 2000 ఎకరాలను సేకరించేందుకు సిద్ధం కాగా,. కేం ద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో యాంకర్‌ షిప్‌బిల్డింగ్‌ కోసం మరో 2000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రియల్‌ పార్కు (ఎన్‌షి్‌ప) యాజమాన్యంతో శుక్రవారం రాష్ట్ర మౌలిక సదుపాయాలకల్పనశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఏపీ మారిటైం బోర్డు సీఈవో ప్రవీణ్‌ ఆదిత్య, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ సీఎండీ జస్మిత్‌సింగ్‌ బిద్ర ముంబైలో చర్చలు జరిపారు. దుగరాజపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణంలో భాగస్వామ్యమయ్యేందుకు ఎన్‌షి్‌ప ముందుకు వచ్చింది. త్వరలోనే సీఎంతో సమావేశమయ్యేందుకు మౌలిక సదుపాయాల కల్పన శాఖ సన్నాహాలు చేస్తోంది.

Updated Date - Jul 19 , 2026 | 05:34 AM