Share News

తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు బాలిక మృతి..

ABN , Publish Date - May 04 , 2026 | 07:30 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై బాలిక మృతిచెందింది.

తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు బాలిక మృతి..
Lightning Strikes

అల్లూరి సీతారామరాజు జిల్లా: డుంబ్రిగుడ మండలంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై బాలిక మృతిచెందింది. ఖండ్రూం పంచాయతీ సింధేరిగూడలో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం మొదలవ్వడానికి ముందే గ్రామానికి సమీపంలోని కొండకు కొంకోడి కూర సేకరించేందుకు సొంగుల దివ్య (13) వెళ్లింది.


తన అక్క, మరో ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి కొండపైకి వెళ్లింది. కొంకోడి కూర సేకరణ అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రామానికి వస్తుండగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగుపాటుకు గురై దివ్య ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారిని కొండ పైనుంచి స్నేహితులు మోసుకొచ్చారు. ఈ ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరోవైపు సింధేరిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

Updated Date - May 04 , 2026 | 07:34 PM