Share News

ఎన్డీయే ఆధిక్యం.. ఏపీలో బీజేపీ నేతల సంబరాలు

ABN , Publish Date - May 04 , 2026 | 01:16 PM

వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంపై ఏపీలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అస్సాంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని తెలిపారు.

ఎన్డీయే ఆధిక్యం.. ఏపీలో బీజేపీ నేతల సంబరాలు
BJP celebration

విజయవాడ, మే 4: దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్, అస్సాంలో ఎన్టీఏ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో చారిత్రక ఫలితాలు వచ్చాయన్నారు. అస్సాంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని తెలిపారు. ఆటవిక పాలనకు చెక్ పెట్టి బెంగాల్ ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు.


తమిళనాడులో రెండో స్థానంలో ఎన్డీయే కూటమి ఉందని.. కేరళలో కూడా స్పష్టమైన ఓట్ షేర్ బీజేపీకి వచ్చిందని మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని ఓడించాలని చేతులు కలిపాయని విమర్శించారు. కేరళంలో మాత్రం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు వేరుగా పోటీ చేస్తున్నాయన్నారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా ప్రయాస్’ పేరుతో బీజేపీ అడుగులు వేస్తోందన్నారు. పశ్చిమ, తూర్పు, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. 12 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్నాయని వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ దిశగా బీజేపీ అడుగులు వేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సంత్ త్యాగరాజ 259వ జయంతి.. డిప్యూటీ సీఎం పవన్ నివాళులు

తీరు మార్చుకోకపోతే.. వైసీపీకి గుండు సున్నా ఖాయం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - May 04 , 2026 | 01:54 PM