అక్టోబర్ 3న ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 15 , 2026 | 06:00 PM
‘స్వర్ణాంధ్ర 2047’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధనకు పటిష్ఠమైన బ్లూప్రింట్ రూపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 3న విజయవాడలో ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’ నిర్వహించనుంది.
విజయవాడ: ‘స్వర్ణాంధ్ర 2047’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధనకు బలమైన బ్లూప్రింట్‌ను రూపొందించడమే లక్ష్యంగా అక్టోబర్ 3న విజయవాడలో ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిలో యువతను భాగస్వాములను చేస్తూ, వారి ఆలోచనలు, ప్రతిభ, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.
‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ నిర్మాణంలో యువత శక్తి, సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక ఆవిష్కరణలే కీలక చోదక శక్తులని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్‌టెక్, స్పేస్‌టెక్, క్లీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు, పరిశోధనలు, స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో కొత్త అవకాశాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read:
తిరుమల కల్యాణ వేదికలో పుష్ప ప్రదర్శనశాల ప్రారంభం
IPSలు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై సస్పెన్షన్ ఎత్తివేత