Vizag South Coast Railway News: ఉత్తరాంధ్రకు మరో శుభవార్త.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు
ABN , Publish Date - Jan 07 , 2026 | 10:39 AM
భోగాపురం ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడగా, జోన్ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది.
విశాఖ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయాల నిర్వహణ కోసం అవసరమైన ఉద్యోగుల కేటాయింపుపై రైల్వే అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, సౌత్ కోస్టల్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ బదిలీలను చేపట్టనున్నారు.
ఇదిలా ఉండగా, విశాఖలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు సంబంధించిన కార్యాలయ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. జోన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఉద్యోగావకాశాలు పెరగడమే కాకుండా, రైల్వే సేవలు మరింత మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
జేఎన్‌టీయూలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులు
చలికాలంలో మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? కారణాలు తెలుసుకోండి..
For More Latest News