Share News

తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రారంభం.. స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయి మంత్రి జనార్దన్ రెడ్డి

ABN , Publish Date - Oct 06 , 2026 | 01:12 PM

హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రారంభం స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయి అని రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివర్ణించారు.

తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రారంభం.. స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయి మంత్రి జనార్దన్ రెడ్డి
AP Minister BC Janardhan Reddy

విశాఖపట్నం, అక్టోబర్ 06: హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (HSL)లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్(FSS) ప్రారంభం స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయి అని రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ సూర్య‌గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త స్లిప్‌వే ప్రారంభం, 5వ ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణానికి కీల్ లేయింగ్.. హెచ్ఎస్ఎల్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమన్వయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధితో విశాఖ ప్రధాన నౌకాయాన, పారిశ్రామిక కేంద్రంగా బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హెచ్‌ఎస్‌ఎల్ వృద్ధితో MSMEలు, స్థానిక పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆకాంక్షించారు.


స్వదేశీ నౌకా నిర్మాణం, దేశీయ సరఫరా వ్యవస్థ బలోపేతంతో ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు మరింత బలం చేకూరుతోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండియన్ నేవీ, పారిశ్రామిక రంగాల సమన్వయంతో విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక ఎంపీ శ్రీ భరత్, స్థానిక ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.


విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జల ప్రవేశం చేయించారు. 43,500 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలు భారత నావికాదళానికి అదనపు బలాన్ని చేకూరుస్తాయి. యుద్ధనౌకలకు నడిసంద్రంలో ఇంధనాన్ని అందిస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత రక్షణ రంగంలో హిందూస్థాన్ షిప్ యార్డ్ కీలకపాత్ర: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం: కండక్టర్‌పై చర్యలకు మంత్రి ఆదేశం

Updated Date - Oct 06 , 2026 | 02:08 PM