అనకాపల్లిలో కూలిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్.. ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:03 PM
అనకాపల్లిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూలడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.
అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 18: అనకాపల్లిలో రైల్వే స్టేషన్లో త్రుటిలో ఓ పెద్ద ప్రమాదం తప్పింది. విజయరామరాజపేట అండర్ బ్రిడ్జ్ వద్ద సేఫ్టీ గడ్డర్‌ను క్వారీ రాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బ్రిడ్జ్ కుంగిపోయింది. నిర్మాణ దశలో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.
బ్రిడ్జ్ కూలడంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇనుప బద్దీలు రైలు పట్టాలపై పడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే.. రైల్వే సిబ్బంది ఆ ఇనుప బద్దీలను తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని తొలగించాక రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి.
ఇవీ చదవండి:
నిడదవోలు – దువ్వాడ రైల్వే క్వాడ్రూప్లింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
పేదలకు నాణ్యమైన భోజనమే అన్న క్యాంటీన్ల లక్ష్యం: హోంమంత్రి అనిత