బస్సు ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్యంపై మంత్రి ఆరా
ABN , Publish Date - May 31 , 2026 | 06:06 PM
గాజువాక ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
అమరావతి, మే31: గాజువాక ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. క్షతగాత్రులకు అండగా ఉండాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఈ క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తుండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్‌ను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆదివారం విశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై వైద్యులు, జిల్లా అధికారులతో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు.
ఈ ప్రమాదంలో గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్‌లో వైద్యం అందిస్తున్నామని మంత్రికి వైద్యులు తెలిపారు. మరొకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. వీరందరికీ వైద్య చికిత్స కొనసాగుతుందన్నారు. వారిలో ఒకరికి శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే వీరిందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా వైద్యులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన మూడు మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయిందని.. వాటిని వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశామని మంత్రికి వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు మంత్రి సత్య కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ మాటలకు విశ్వసనీయత ఉందా?..: ఎమ్మెల్యే హరీష్ రావు
ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం
For More AP News And Telugu News