ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం
ABN , Publish Date - May 31 , 2026 | 04:04 PM
రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
అమరావతి, మే 31: రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అంతేకాకుండా.. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని ప్రజలకు సూచించారు.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 17 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత అధికంగా ఉందని.. ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలన్నారు. వాతావరణంలో తేమ వల్ల ఉక్కపోత అధికంగా ఉంటుందని, రాబోయే రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్రీడల్లో నిజాయతీగా ఆడినవారికి ఉద్యోగాలొస్తాయనడానికి మేమే నిదర్శనం: ఉపాధ్యాయులు
సీఎం.. జేబులో కత్తెర, రిబ్బన్‌తో తిరుగుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు
For More AP News And Telugu News