వాటర్ ట్యాంక్ స్లాబ్ కూలి సెంట్రింగ్ మేస్త్రికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 08:26 PM
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదిగల్లం గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ స్లాబ్ ఆదివారం కుప్పకూలింది. అందులో సెంట్రింగ్ మేస్త్రి చిక్కుకుపోయాడు.
అనకాపల్లి, ఆగస్టు 23: జిల్లాలోని నక్కపల్లి మండలం బోదిగల్లం గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ స్లాబ్ ఆదివారం కుప్పకూలింది. అందులో సెంట్రింగ్ మేస్త్రి చిక్కుకుపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి.. అందులో నుంచి అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చివరకు శిథిలాల నుంచి అతడిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మేస్త్రిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్లాబ్ వేస్తుండగానే.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులకు స్థానికులు వివరించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే స్లాబ్ కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తునికి చెందిన సెంట్రింగ్ మేస్త్రి పేరు అభి అని పోలీసులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు వివరించారు.
వార్తలు కూడా చదవండి..
వెలిగొండ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు: లంక దినకర్
ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి
For More AP News And Telugu News