పాక్ గ్రూపులకు నేవీ సమాచారం.. ఉద్యోగి అదుపులో
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:33 AM
పాకిస్థాన్‌లోని గ్రూపులకు నౌకాదళ సమాచారాన్ని పంపించినట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో విజయవాడలో ఉంటున్న భారత నేవీ ఉద్యోగిని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ బృందాలతో సంబంధాలు నెరపుతున్న భారత నేవీ ఉద్యోగిని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా అతడు విజయవాడలో ఉంటూ.. నౌకాదళ సమాచారాన్ని పాక్‌లో ఉన్న గ్రూపులకు పంపించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌కు నిర్దిష్ట సమాచారం అందడంతో ఈ విభాగానికి చెందిన ప్రత్యేక బృందం శనివారం రాత్రి అతడిని నిర్బంధించింది.
ఈ వార్తలనూ చదవండి: