Share News

వెలిగొండ క్రెడిట్‌.. ముమ్మాటికీ చంద్రబాబుదే!

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:48 AM

వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్‌ ఎవరికి దక్కుతుందో రాష్ట్రప్రభుత్వం తేల్చేసింది. ఏ ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చుచేశారో అధికారిక గణాంకాలు విడుదల చేసింది. వెలిగొండ మొదటి దశను గతనెల 31న చంద్రబాబు జాతికి అంకితం చేశారు.

వెలిగొండ క్రెడిట్‌.. ముమ్మాటికీ చంద్రబాబుదే!

  • అధికారిక గణాంకాలు విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్‌ ఎవరికి దక్కుతుందో రాష్ట్రప్రభుత్వం తేల్చేసింది. ఏ ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చుచేశారో అధికారిక గణాంకాలు విడుదల చేసింది. వెలిగొండ మొదటి దశను గతనెల 31న చంద్రబాబు జాతికి అంకితం చేశారు. అయితే 2024 ఎన్నికలకు ముందే తాను వెలిగొండను జాతికి అంకితమిచ్చానని.. కొత్తగా చంద్రబాబు ప్రారంభించడమేమిటని జగన్‌ ప్రశ్నిస్తున్నారు. తనకు రావలసిన క్రెడిన్‌ను చంద్రబాబు చోరీ చేస్తున్నారని పదేపదే చెప్పుకొంటున్నారు. ఇప్పుడు ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెరపైకి వచ్చారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే వెలిగొండకు భారీగా నిధులిచ్చి, పూర్తి చేసేందుకు కార్యాచరణ పూర్తి చేశారని ప్రకటించారు. ఇలా ఎవరికివారు తమదే క్రెడిట్‌ అని చెప్పుకొంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం...

చంద్రబాబు 5233 కోట్లు

1996లో శంకుస్థాపన

2004 వరకు : 430 కోట్లు

2014-19 మధ్య : 1814 కోట్లు

2024 నుంచి ఇప్పటికి: 2989 కోట్లు

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 1126 కోట్లు

రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి రూ.720 కోట్లు

వైఎస్‌ జగన్‌ 841 కోట్లు

ఇవి కూడా చదవండి

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 04:48 AM