Share News

ఉండి నియోజకవర్గంలో వైసీపీకి షాక్.. పార్టీకి పీవీఎల్ నరసింహరాజు గుడ్ బై

ABN , Publish Date - Jul 24 , 2026 | 06:18 PM

ప.గో. జిల్లా ఉండి నియోజవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి పీవీఎల్ నర్సింహరాజు రాజీనామా చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నర్సింహరాజును తొలగించి, ఆయన స్థానంలో మంతెన యోగేంద్ర కుమార్ (బాబు)ను వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో ఆగ్రహించిన పీవీఎల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఉండి నియోజకవర్గంలో వైసీపీకి షాక్.. పార్టీకి పీవీఎల్ నరసింహరాజు గుడ్ బై
Undi YSRCP News

ప.గో. జిల్లా, జులై 24: జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి పీవీఎల్ నర్సింహరాజు రాజీనామా చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నర్సింహరాజును తొలగించి, ఆయన స్థానంలో మంతెన యోగేంద్ర కుమార్ (బాబు)ను వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో ఆగ్రహించిన పీవీఎల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పీవీఎల్ నర్సింహరాజు ఉండి నుంచి వైసీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో డీసీసీబీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.


ఈ సందర్భంగా పీవీఎల్ నర్సింహరాజు మాట్లాడుతూ.. ‘నియోజకవర్గ ఇంచార్జి గా 2017 లో ప్రత్యేకంగా జగన్ పిలిచి అవకాశం ఇచ్చారు. నేను ఓడిపోతాను అని తెలిసి నియోజకవర్గంలో పోటీ చేసాను. నా డబ్బులతో ఎలక్షన్ చేసుకున్నాను. నిజాయితీగా జగన్ గౌరవం నిలబడే విధంగా నియోజకవర్గం పనిచేసాను. మొన్న రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని జగన్‌ను కలిశాను. యోగేంద్ర కుమార్‌కు ఇంచార్జి ఇస్తే సహకరించే ప్రసక్తి లేదని చెప్పా. నా మాట కాదని యోగేంద్ర బాబు‌కు ఇంచార్జి ఇచ్చారు. ఆయన ఏనాడు జండా పట్టలేదు, పార్టీకి పని చేయలేదు. కానీ అతనికే ఇంచార్జి పదవి ఇచ్చారు. పార్టీలో గౌరవం లేనపుడు ఉండి ఏం లాభం.. అందుకే రాజీనామా చేశాను. జిల్లాలో ఇద్దరు నాయకులు డమ్మీలను పెట్టి పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారు. ఇద్దరి వల్ల జిల్లాలో వైసీపీ పార్టీ నాశనం అయ్యింది. పార్టీ నుంచి బయటకు వెళ్ళి పోతున్న గ్రంధి శ్రీనివాస్, కొట్టి సత్యనారాయణ‌తో పార్టీ అధ్యక్షుడు మాట్లాడలేదు. నన్ను నమ్ముకున్న సహచరుల కోసం, నాకు ఒక పార్టీ అండ ఉండాలి. వారంలోపు భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తాను.’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సైజులో రేషన్‌ కార్డు

మాకు సంబంధం లేదు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 07:05 PM